శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (17:47 IST)

రైలుపై రాయి రువ్విన దుండగుడు.. ప్రయాణీకుడికి గాయం (video)

stone
stone
సోషల్ మీడియాలో ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాయిని రువ్విన వీడియో వైరల్ అవుతోంది. బీహార్‌లోని పాట్నాలోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందిన జైనా అనే యువకుడా రాయి విసిరాడు. బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి జైనగర్‌కు ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో రైలులో కిటికీ పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయమైంది. ఈ రాయి రువ్విన ఘటనలో ఆ ప్రయాణీకుడి ముక్కుకు గాయం అయ్యింది. ఈ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. వీడియో ఆధారంగా నేరస్థుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.