శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జులై 2024 (12:20 IST)

"మేము కాపులం.. రంగాగారి వారసులం" - యువకుల హంగామా... డ్రాయర్లపై నిలబెట్టిన పోలీసులు (Video)

kapu youths
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా, జనసేన పార్టీ చీఫ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. తనమన అనే తేడా లేకుండా కఠినంగా ఉండాలంటూ పోలీస్ యంత్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కొందరు యువకులు గంజాయి మత్తులో హల్చల్ చేశారు. మేము కాపులం అంటూ ఏపీ మంత్రి వాహనానికి అడ్డుపడి హంగామా చేశారు.
 
పైగా, దివంగత ఎన్జీ రంగా వారసులం, నిజమైన కాపులం అంటూ రచ్చరచ్చే చేశారు. పోలీసులను సైతం పరుష పదజాలంతో దూషిస్తూ వారిపైకి వెళ్లారు. దీనికి కారణం గంజాయి మత్తు. ఆ మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు... ఆ తర్వాత ఆ యువకులను పోలీస్ స్టేషన్‍‌కు తీసుకెళ్లి కడ్ డ్రాయర్లపై (లోదుస్తు) నిలబెట్టారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మసకపల్లిలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనానికి అడ్డుపడిన ఈ యువకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మేం పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ నానా రభస చేశారు. గంజాయి మత్తులో మేము కాపులం అంటూ బట్టలిప్పి హంగామా చేసిన ఆరుగురు యువకులు.. యువకులను అదుపులో తీసుకుని తమదైనశైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతేనా.. వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్త వైరల్ అయ్యాయి.