శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (09:18 IST)

రోడ్డు వేయొద్దన్న ఇద్దరు మహిళలు... మట్టిలో పూడ్చే యత్నం - Video Viral

woman burried
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల పట్ల కొందరు అతి దారుణంగా ప్రవర్తించారు. తమ భూమిలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలను సజీవంగా మట్టిలో పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ దుశ్చర్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లాలో జరిగింది. తమ భూమిలో రోడ్డు వేయొద్దని ఇద్దరు మహిళలు నేలపై కూర్చుని ఆందోళనకు దిగారు. ఆ మహిళ ఆందోళను ఏమాత్రం పట్టించుకోలేదు కదా వారిపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రక్కు డ్రైవర్ అందులోని మట్టి వారిపై పోశాడు. దీంతో నడుములలోతు వరకు వారు పూడుకుపోయారు. రోడ్డు వేసే నిర్వాహకులను ఇద్దరు మహిళలు కాళ్లు వేళ్లూ పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పటికీ వారు ఏమాత్రం కనికరించకుండా మహిళలను గొయ్యిలో నిలబెట్టి భుజాల వరకు మట్టి నింపారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.