గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (13:36 IST)

భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకున్న మహిళ.. చెట్టుకు కట్టేసి దాడి చేసిన మహిళలు (Video)

attack on woman
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఓ అమానుష ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ గ్రామ మహిళలు పెళ్లి చేసుకున్న మహిళను చెట్టుకు కట్టేసి కోడిగుడ్లతో దాడి చేసి, కర్రలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ.. రెండో వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ మహిళలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆపై తప్పు చేసిందంటూ విచక్షణా రహితంగా ప్రవర్తించారు. కర్రలతో ఆమెను కొడుతూ, కోడిగుడ్లతో దాడి చేస్తూ ఆమెను నానా హింసకు గురిచేశారు. 
 
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి ఠాణాకు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, మహిళల దాడిలో గాయపడిన బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.