మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జులై 2024 (14:16 IST)

జిందాల్ గ్రూప్ ఉద్యోగి.. విమానంలో నా శరీరాన్ని అభ్యంతరకరంగా తాకాడు..

woman
మహిళలపై అకృత్యాలు ఎక్కడపడితే అక్కడ జరుగుతుంటాయి. తాజాగా జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి మహిళా వేధింపుల వ్యవహారంలో చిక్కుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా నుంచి అబుదాబీ వెళ్తున్న విమానంలో జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తనను అసభ్యకరంగా తాకారని ఓ ప్రయాణికురాలు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల బాధితురాలు.. తనకు విమానంలో పరిచయమైన వ్యక్తి దినేశ్ ఆర్ అని.. ఆయనకు 65 ఏళ్లు వుండవచ్చునని ఎక్స్‌లో తెలిపింది.  
 
తొలుత తన హాబీల గురించి చెప్పిన ఆయన, తన సెల్‌ఫోన్‌లో కొన్ని వీడియోలు ఉన్నాయంటూ అసభ్య చిత్రాలు చూపించాడని పేర్కొంది. తాను షాకైపోయిన సమయంలో శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడని పేర్కొంది.
వెంటనే తాను తేరుకుని వెళ్లి క్రూ సిబ్బందికి ఫిర్యాదు చేశానని, వారు పోలీసులకు సమాచారం అందించారని తెలిపింది. 
 
విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారని, అయితే, తను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే బోస్టస్ ఫ్లైట్ మిస్సయ్యే అవకాశం ఉండటంతో కంప్లయంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.
 
అయితే, తనకు ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై జిందాల్ గ్రూప్ చైర్మన్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించానని, తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.