బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (10:32 IST)

తిరుపతిలో ముసుగు దొంగలు.. వ్యాపారి ఇంట్లో చొరబడి మహిళను చంపేశారు..!

murder
తిరుపతిలో ముసుగు యువకుల దాడిలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాయల్ నగర్‌లో గురువారం వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లోకి వృద్ధురాలు, బాలిక మినహా కుటుంబ సభ్యులందరూ లేని సమయంలో ముసుగు ధరించిన యువకుడు చొరబడ్డాడు. 
 
ఇంట్లో ఉన్న మహిళ, బాలికపై దాడి చేశాడు. కత్తి దాడిలో 75 ఏళ్ల జయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక నియాతి (12) తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా వచ్చాడా లేక ఇతరులతో వచ్చాడా అనేది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం ఈ వ్యాపారి కుటుంబ సభ్యులపై కూడా ఇదే తరహాలో కత్తి దాడి జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 
పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ ఇంటిని పరిశీలించారు. ఇప్పటికే వరకు చిక్కిన ఆధారాల ఆధారంగా దుండగుడిని పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.