సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (13:23 IST)

శరీరాకృతిపై ఆఫీసులో వేధింపులు.. బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య!!

suicide
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ విషాదం చోటుచేసుకుంది. తన శరీరాకృతిపై గురించి పదేపదే కామెంట్స్ చేయడంతో తీవ్ర మనోవేదనకుగురైన ఓ మహిళా బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ఐదుగురు సహోద్యోగులు కారణమంటూ సూసైడ్ లేఖ రాసిన ఆమె వారికి మరణశిక్ష వేయాలని పేర్కొంది. నోయిడాలోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌లో పనిచేసే శివానీ త్యాగీ గత శుక్రవారం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన శరీరాకృతి, దస్తులు మాట తీరు తదితరాలపై తోటి ఉద్యోగుల వేధింపుల, టార్చర్ తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని ఘజియాబాద్ డీసీపీ తాజాగా పేర్కొన్నారు. 
 
శివానీ కార్యాలయంలో పని చేసే తోటి మహిళా ఉద్యోగి తన సోదరిని సూటిపోటి మాటలు. వెక్కిరింతతో వేధించేదని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. ఓసారి ఆమె శివానీపై దాడికి దిగితే ఆమె తిరిగి చెంపపగలగొట్టిందని అన్నారు. తాను చాలా సార్లు రిజైన్ చేద్దామని అనుకున్నా, కంపెనీ వారు ఏదో కారణంతో ఆమె ప్రయత్నాన్ని తిప్పికొట్టేవారని చెప్పాడు. చెంప దెబ్బ ఘటన తర్వాత శివానీకి టెర్మెనేషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఆఫీసులో వేధింపులపై శివానీ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చర్యలు తీసుకోలేదని ఆమె సోదరుడు ఆరోపించాడు.