ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (18:25 IST)

పవన్ కల్యాణ్ పైన ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తుంటే కృష్ణవంశీ ఏమన్నారో తెలుసా?

Pawan kalyan
Pawan kalyan
డైరెక్టర్ కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అంటూ వరుస సంచలన ట్వీట్లు చేశారు. డైరెక్టర్ కృష్ణ వంశీ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఇష్యూపై స్పందించారు. 
 
"మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నాకు బోలెడంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. అవినీతిపరమైన, కలుషితమైన రాజకీయ నాయకుల మధ్యలో ఒకరు విలువల కోసం నిలబడుతున్నారు. దేవుడు ఆయనతో ఎప్పుడూ ఉండాలి అని" కృష్ణవంశీ అన్నారు.
 
అలాగే యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ కళ్యాణ్ స్పెషల్ పొలిటీషియన్‌గా తాను ఫీల్ అవుతున్నాను అని ట్వీట్ చేశారు. దీంతో ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్‌ని యోగి ఆదిత్యనాథ్‌తో పోల్చకండి అని చెప్పాడు. అయితే తాను కచ్చితంగా చెప్పగలను పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అని స్పష్టం చేశారు కృష్ణవంశీ. దీంతో కృష్ణవంశీ ట్వీట్స్ వైరల్‌గా మారాయి.