బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (14:18 IST)

గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత మరో అవతారం : ప్రకాష్ రాజ్

prakashraj
సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు చర్చనీయాశంగా మారింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగానూ, చర్చనీయాంశంగా మారింది. 
 
"గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్" అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. బుధవారం చేసిన ఓ ట్వీట్‌లో చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో అంటూ నటుడు కార్తీ సంఘటనను పరోక్షంగా ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. 
 
అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేస్తున్నారని తెలిసిందే. కానీ, నిన్న, నేడు మాత్రం నేరుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.