బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (09:42 IST)

తిరుపతి లడ్డూ వివాదంపై అసదుద్ధీన్ ఓవైసీ ఏమన్నారంటే?

asaduddin owaisi
తిరుపతి లడ్డూ వివాదంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగంచే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటున్నారని, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే తప్పేనని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ కావడం బాధాకరమని, అలా జరగకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 
 
హిందూ దేవాలయాలకు హిందువులను మాత్రమే చైర్మన్లుగా నియమిస్తున్న ప్రభుత్వాలు... వక్ఫ్ బోర్డులో ఎలా కలుగజేసుకుంటాయని అన్నారు. అలాగే వక్ఫ్ చట్టాన్ని సవరించి బోర్డు మెంబర్లుగా హిందువులను నామినేట్ చేస్తామంటున్నారని, ఇది తప్పు కాదా? అని ఒవైసీ నిలదీశారు. 
 
వక్ఫ్ భూమి ఉందా లేదా అనేది కలెక్టర్ నిర్ణయిస్తారని ఏఐఎంఐఎం అధినేత అన్నారు. “కలెక్టర్ ప్రభుత్వపు వ్యక్తి కాబట్టి న్యాయం ఎలా జరుగుతుంది? ఈ బిల్లు వక్ఫ్‌కు అనుకూలంగా లేదని, వక్ఫ్‌ను రద్దు చేసేందుకే రూపొందించిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.