1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Mehreen Pirzada questioned about sex racket after revealing Tollywood connection

మెహ్రీన్‌కు చేదు అనుభవం.. అరగంట విచారణ.. తల్లిదండ్రుల వద్దకు వెళ్తే?

హీరోయిన్ మెహ్రీన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. టాలీవుడ్ హీరోయిన్ కావడంతో అమెరికాలోని ఓ విమానాశ్రయంలో మెహ్రీన్‌ను అరగంట పాటు విచారించారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. చికాగో సెక్స్ రాకెట్ ఉ

Mehreen Pirzad
హీరోయిన్ మెహ్రీన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. టాలీవుడ్ హీరోయిన్ కావడంతో అమెరికాలోని ఓ విమానాశ్రయంలో మెహ్రీన్‌ను అరగంట పాటు విచారించారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. చికాగో సెక్స్ రాకెట్ ఉదంతం కలకలం రేపిన నేపథ్యంలో.. తన తల్లిదండ్రులను కలిసేందుకు కెనడాలోని వాంకూవర్ నుంచి అమెరికాకు వెళ్తుండగా, అమెరికాలోని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు తనను ఆపేశారని తెలిపింది. 
 
తాను టాలీవుడ్ హీరోయిన్ కావడంతో అరగంట పాటు తనను విచారించారని మెహ్రీన్ చెప్పింది. దీంతో షాక్‌కు గురయ్యానని.. టాలీవుడ్ నిర్మాత అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడనే విషయం ఇంతవరకు తెలియదని, ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పాకే తెలిసిందని వెల్లడించారు. అమెరికాకు వచ్చే ప్రతి నటిని విచారిస్తున్నట్టు అధికారులు చెప్పారని తెలిపింది.
 
అమెరికాలోని చికాగో కేంద్రంగా మోదుగమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ సాగించిన సెక్స్ రాకెట్‌లో భాగమైన తెలుగు హీరోయిన్లపై అమెరికా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ నిర్వహించిన సెక్స్ రాకెట్‌లో భాగమైన టాలీవుడ్ హీరోయిన్లను ఆరు గంటల పాటు అమెరికా అధికారులు ప్రశ్నించగా, వీరు అప్రూవర్లుగా మారినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
తర్వాతి కథనం
ఇంగ్లండ్‌లో ఘోరం- 18నెలల బాబును ఆరో అంతస్థు నుంచి పారేసింది.. ఎందుకంటే?