సంబంధిత వార్తలు
- ఆ దేవత గుడి ముందు బండరాళ్లను ఎత్తితే పెళ్ళవుతుంది.. ఎక్కడ? (video)
- ముస్లింను కించపరిచేలా వున్న పబ్జీ గేమ్.. యువతను తప్పుదోవ పట్టించేందుకే?
- కార్లకు నిప్పుపెట్టి.. యువకుల పైశాచికానందం... ఎక్కడ?
- నయా ఛాలెంజ్... ముఖంపై బొద్దింకను పెట్టుకుని...
- పార్లమెంట్లో బీజేపీ ఎంపీ కారుకు తుపాకీ ఎక్కుపెట్టిన సెక్యూరిటీ.. ఎందుకు?
పెళ్ళైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దు.. ముంచేస్తారు జాగ్రత్త: నీనా గుప్తా
Neena Gupta
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌తో నీనా గుప్తా సహజీవనం చేశారు. వారికి ఓ బిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత రిచర్డ్స్‌తో ఆమెకు మనస్పర్థలు రావడంతో... ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె మరొకరిని పెళ్లాడారు. ఆ నేపథ్యంలో పెళ్ళైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దని నీనా గుప్తా హితవు పలికారు. ప్రస్తుతం ఈమె కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లైన వ్యక్తితో సంబంధం ద్వారా తాను నేర్చుకున్న గుణపాఠాలను ఆమె వెల్లడించారు. జీవితంలో ఎవరి తోడు లేకపోయినా ఒంటరిగా బతికేయవచ్చునని.. కానీ పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని నీనా గుప్తా నేటి తరానికి సూచించారు. పెళ్లైన వ్యక్తి తొలుత తన భార్య అంటే ఇష్టం లేదంటాడని, త్వరలోనే విడాకులు తీసుకుంటానని నమ్మిస్తాడని నీనా గుప్తా తెలిపాడు. చివరికి అతని మాటలు నమ్మితే మోసం చేస్తారని చెప్పుకొచ్చారు.
చివరికి పెళ్లైన వ్యక్తితో సంబంధం అతనితో రహస్యంగా కలిసేలా చేస్తుందని వెల్లడించారు. ఇలా చాలా రోజులు గడిచిపోతాయని.. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే మాత్రం పెళ్లైన వ్యక్తికి చిరాకు వస్తుందని.. వాస్తవం గ్రహించేలోపే అతను కాస్త దూరమవుతాడని తెలిపారు. తన జీవితంలో కూడా ఇదే జరిగిందని... ఎంతో ఆవేదనను అనుభవించానని తెలిపారు. అందుకే అందరికీ చెబుతున్నానని... పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడొద్దని హెచ్చరిస్తున్నానని వీడియో ద్వారా వెల్లడించారు.
