శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (13:21 IST)

తొమ్మిదో తరగతి విద్యార్థిని కడుపులో కదలికల్లేని ఆడ శిశువు.. రేప్ చేయడంతో?

వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ అత్యాచార పాపం.. ఆ విద్యార్థిని కడుపులో శిశువు పడేందుకు కారణమైంది. కడుపు నొప్పి అను

వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ అత్యాచార పాపం.. ఆ విద్యార్థిని కడుపులో శిశువు పడేందుకు కారణమైంది. కడుపు నొప్పి అనుకుని గర్భం ధరించిన విషయాన్ని తెలుసుకోలేకపోయిన  ఆ పిచ్చి తల్లి చివరికి ఆస్పత్రిలో కదలికల్లేని శిశువును తన కడుపు నుంచి తీశారని తెలుసుకుని షాక్ తింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం, బుక్కరాయసముద్రానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి  బాలిక (14) రాత్రి కడుపు నొప్పి రావడంతో తండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తన కడుపులో గడ్డ ఉందని బాలిక వైద్యులకు తెలిపడంతో ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో గడ్డ లేదని పిండం ఉండటంతో అవాక్కయ్యారు. 
 
కడుపులో ఉన్న శిశువు ఎలాంటి కదలికలు లేవని వైద్యులు చెప్పడంతో విద్యార్థిని తల్లిదండ్రులు షాక్ తిన్నారు. శనివారం తెల్లవారుజామున ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. అప్పటికే కడుపులోని ఆడ శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో విద్యార్థినిపై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడని బాలిక చెప్పడంతో, నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
పోలీసుల విచారణలో బాలిక తల్లి పదేళ్ల క్రితమే మరణించిందని, బాలిక తండ్రి సైకిల్ షాపు నిర్వహిస్తున్నాడని తెలిసింది. ట్యాక్సీ డ్రైవర్ చేసిన పనికి ఆ బాలిక గర్భం దాల్చిందని.. తల్లి కూడా పక్కన లేకపోవడంతో కడుపు నొప్పితో బాలిక పాఠశాలకు సెలవులు పెట్టేదని, ఈ విషయంపై బాలిక తండ్రిని కూడా మందలించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.