మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:10 IST)

కామ్రేడ్ అటల్ బిహారీ వాజ్‌పేయి... ఆర్ఎస్ఎస్‌ వాదిగా ఎలా మారారు?

అటల్ బిహారీ వాజ్‌పేయి ఓ కామ్రేడ్. ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరకముందు ఓ కమ్యూనిస్టు వాది. కమ్యూనిజం భావజాలంతో ఆయన మనసంతా నిడిపోయింది. ఆ తర్వాత ఆరెస్సెస్‌కు వీరాభిమానిగా మారిపోయారు. స్వయం సేవక్‌గా చేరి ప్రచారక్

అటల్ బిహారీ వాజ్‌పేయి ఓ కామ్రేడ్. ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరకముందు ఓ కమ్యూనిస్టు వాది. కమ్యూనిజం భావజాలంతో ఆయన మనసంతా నిడిపోయింది. ఆ తర్వాత ఆరెస్సెస్‌కు వీరాభిమానిగా మారిపోయారు. స్వయం సేవక్‌గా చేరి ప్రచారక్‌గా మారి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
 
ఆరెస్సెస్‌లో చేరక ముందు కమ్యూనిజం వైపు  అడుగులు వేశారు. వామపక్ష విద్యార్థి సంఘం.. ఆలిండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌)లో సభ్యుడిగా పనిచేశారు. బాబాసాహెబ్‌ ఆప్టే ప్రభావంతో 1939లో రాష్ట్రీయ్‌ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)లో చేరి.. అంచలంచెలుగా ఎదిగి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.