1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Odisha : Two Men Arrested for Eating Half-Burnt Body at Funeral in Mayurganj District

చితిపై కాలిన మహిళ మృతదేహాన్ని పీక్కుతున్న నరమాంస భక్షకులు

arrest
ఒడిశా రాష్ట్రంలో ఘోరాతిఘోరం జరిగింది. ఇద్దరు నరమాంసం భక్షకులు వెలుగులోకి వచ్చింది. చితిపై కాలిన మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు పీక్కుతినడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లాలో మధుస్మిత సింగ్ అనే 30 యేళ్ల మహిళ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. వివిధ కారణాలతో పోలీసులు అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
శ్మశానంలో ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే, అంత్యక్రియలకు హాజరైన ఆమె బంధువులు సుందర్ మోహ్ సింగ్ (45) నరేంద్ర సింగ్ చితిపై కాలిన మధుస్మిత మృతదేహంలో కొన్ని భాగాలను ఆరగించారు. వారిద్దరూ చితి వద్ద మధుస్మిత శరీర భాగాలను ఆరగిస్తూ గమనించి ఇతర బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సాక్ష్యాధారాలు ఉండడంతో వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని మయూర్ భంజ్ జిల్లా ఎస్పీ బి.గంగాధర్ తెలిపారు. సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్‌లను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారిద్దరూ గతంలో కూడా ఇలాగే నరమాంసం భక్షణ చేసేవారా? అనే కోణంలో విచారిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. వారిద్దరూ సారా తాగిన మైకంలో నరమాంస భక్షణ చేశారని పోలీసులు వెల్లడించారు. 
తర్వాతి కథనం
శ్రీ చైతన్య చీఫ్ బీఎస్ రావుకు అదే ప్రేరణ.. చంద్రబాబు సంతాపం