1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Pawan kalyan belssed Nithin, Ramgopal Varma satires on Power star

పంచెకట్టులో నితిన్‌ను దీవించిన పవన్, ఈ 'బాబుబాబా'ను నమ్ముతానంటూ ట్వీటిన వర్మ

Pawan kalyan
ఈనెల 26 వ తేదీన సినీ హీరో నితిన్ వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి కుటంబ సభ్యులుతో పాటు అతి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించాడు నితిన్. ఇక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను స్వయంగా వచ్చి ఆశీస్సులు అందించాలని కోరాడు. పవన్ నితిన్ మ్యారేజ్‌కు తప్పకుండా హాజరవుతాడని వార్తలు కూడా వస్తున్నాయి.
 
అయితే వివాహానికి ముందు జరిగే మెహందీ వేడుకలకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, నిర్మాత చినబాబులు హాజరై నితిన్‌కు సర్ప్రైజ్ చేశారు. అయితే పవన్, త్రివిక్రమ్, నిర్మాత చినబాబుతో కలిసి దిగిన ఫోటోను నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
 
అయితే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ వస్త్రధారణ అభిమానులకు కనువిందు చేసింది. పవన్ చాతుర్మాస్య దీక్షలో ఉండటం వలన కాటన్ దుస్తులతో హాజరై నితిన్‌ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఫోటోపై వర్మ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. నేను మాత్రం ఈ బాబుబాబాను నమ్ముతానంటూ ట్వీటాడు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర దర్శకుడు బందూక్ లక్ష్మణ్ అరుదైన కానుక