శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (19:48 IST)

''పరాన్నజీవి'' కార్యాలయంపై దాడి.. ఫ్లవర్‌స్టార్ ఫ్యాన్స్ పనేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ మేరకు తన కార్యాలయంపై దాడి జరిగిందని ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక జనసేన కార్యకర్తలు వున్నారని, వారే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
#PowerStar పేరుతో తను తీస్తున్న సినిమా, విడుదలయిన ట్రైలర్‌కు వ్యతిరేకంగా ఈ దాడికి పాల్పడినట్లు ఆర్జీవీ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన, పార్టీ గుర్తుని చూపిస్తూ పవర్ స్టార్ ఎన్నికల అనంతరం కథ అంటూ లుక్, ట్రైలర్ కూడా విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అందులో గడ్డితింటావా అంటూ సాంగ్ కూడా వదిలారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసింది. 
 
దీనిపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఆ సినిమా ట్రైలర్‌, ఫస్ట్ లుక్‌లకు డిస్‌లైక్‌లు కొడుతూ కసి తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పవన్ వీరాభిమానులు వర్మను ఉద్దేశిస్తూ "పరాన్న జీవి" సినిమా తీస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ఐదుగురు ఓయూ జేఏసీ విద్యార్ధులను జూబ్లిహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.