1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. There is no guarantee that the coronavirus will decrease with the Anandayya medicine, gradually declining craze on the medicine

కరోనావైరస్ తగ్గుతుందన్న గ్యారెంటీ లేదు: ఆనందయ్య మందుకు తగ్గుతున్న క్రేజ్?

no guarantee
ఆనందయ్య తయారుచేసిన ఔషధం దొరుకుతుందా లేదా అన్న అనుమానం గత రెండురోజుల నుంచి ప్రతి ఒక్కరిలోను కలుగుతోంది. అందుకు కారణం ప్రభుత్వం ఉన్నట్లుండి ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయడమే. అయితే మళ్ళీ అనుమతినిచ్చింది కానీ కావాల్సినంత వనమూలికలు మాత్రం లేకుండా పోయాయట.
 
ఇప్పుడిదే అసలు సమస్యగా మారుతోంది ఆనందయ్యకు. మూలికలు తెచ్చుకోవడానికి బాగా సమయం పడుతుందట. అంతే కాకుండా మూలికల కోసం శిష్యులను పంపించారట ఆనందయ్య. మూలికలు దొరికిన వెంటనే పని ప్రారంభించి మూడురోజుల్లోగానే ఔషధాన్ని పంపిణీ చేయాలని నిర్ణయానికి వచ్చారట.
 
అయితే ఆనందయ్య ఒక్కటే ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నారు. నేను తయారుచేయబోయే మందు ఇక నుంచి నేరుగా మీ ఇంటికే డోర్ డెలివరి వస్తుంది. ఎలా డోర్ డెలివరీ చేయాలన్న విషయంపై ఆలోచిస్తున్నాం. అంతేకాదు స్పీడ్ కొరియర్ల ద్వారా కూడా మందును పంపిణీ చేయబోతున్నాం.
 
ప్రజలు అనవసరంగా క్రిష్ణపట్నంకు రావద్దని ఆనందయ్య రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాడు. మీకోసమే ఈ మందును తయారుచేస్తున్నాం.. మీకు ఇక నుంచి ఔషధం అందుబాటులో ఉంటుంది. ఎవరూ భయపడకండి అంటూ కరోనా రోగులకు ధైర్యాన్ని కూడా చెబుతున్నారు ఆనందయ్య.
 
అయితే ఆనందయ్య మందు కరోనాను తగ్గిస్తుందని మాత్రం ఎక్కడా ప్రభుత్వం చెప్పడం లేదు. ఎవరి నమ్మకం వారిదేనంటూ మందు పంపిణీకి అనుమతినిచ్చేసింది. కానీ కంటిలో వేసే మందుకు మాత్రం అనుమతినివ్వలేదు. సిసిఆర్ఎఎస్ నివేదిక తరువాతే కంటి మందుకు అనుమతినివ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది.
 
ప్రభుత్వమే అనుమానం వ్యక్తం చేయడంతో ఇక ప్రజలు కూడా ఆ మందును ఎంతమేరకు తీసుకుంటారన్నది అనుమానంగా మారింది. ఈ మందు తీసుకుంటే కరోనా గ్యారెంటీగా తగ్గుతుందన్న విషయం ఖచ్చితంగా లేకపోవడంతో, ఆనందయ్య మందును తీసుకుంటారో లేదో అనే అనుమానం కూడా కలుగుతోంది.
About Writer
జె
తర్వాతి కథనం
CBSE పరీక్షలు రద్దు.. కేంద్రం ప్రభుత్వం ప్రకటన