1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Tribal woman and lover assaulted, paraded in Rajasthan's Udaipur

ప్రేమించుకున్నారనీ.. నూలుపోగు లేకుండా ఊరేగించారు... ఎక్కడ?

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో

Rajasthan
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఊరేగింపు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదైపూర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉదయ్‌పూర్ పరిధిలోని సెర్ గ్రామానికి గిరిజన తెగకు చెందిన యువకుడు సమీప గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. 
 
జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆమెతో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య...