1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

గుమ్మడి చట్నీ

వంటకాలు శాకాహారం కందిపప్పు గుమ్మడి చట్నీ ఎండుమిర్చి తురుము ధనియాలు జీలకర్ర వెల్లుల్లి చింతపండు నూనె ఇంగువ గుమ్మడి చట్నీ
FileFILE
కావలసిన పదార్థాలు :
కందిపప్పు... ఒక కప్పు
ఎండుమిర్చి... ఐదు
గుమ్మడి తురుము... అర కప్పు
ధనియాలు, జీలకర్ర... రెండు టీస్పూన్లు
వెల్లుల్లి... ఒక రెబ్బ
చింతపండు... రెండు రెబ్బలు
నూనె... తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి రుబ్బాలి. దీంట్లో కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి రుబ్బి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇంగువతో తాళింపు పెట్టుకోవాలి. అంతే గుమ్మడి చట్నీ సిద్ధమైనట్లే...!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి