1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

పాలకూర సూప్

వంటకాలు శాకాహారం పాలకూర వెజిటబుల్ స్టాక్ ఉప్పు తెల్లమిరియాల మైదా వెన్న క్రీం
కావలసిన పదార్థాలు :
పాలకూర... 800గ్రాములు
వెజిటబుల్‌ స్టాక్... ఒక లీటర్
ఉప్పు... తగినంత
తెల్లమిరియాల పొడి... రుచికి సరిపడా
మైదా... 50 గ్రాములు
వెన్న... వంద గ్రాములు
క్రీం... 15 గ్రాములు

తయారీ విధానం :
పాలకూరను ఉడకబెట్టి మెత్తగా నూరుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని అందులో వెన్న వెయ్యాలి. వెన్న కరిగిన తర్వాత అందులో మైదా వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత వెజిటబుల్‌ స్టాక్‌ పోసి సన్నని మంటపై 10 నిమిషాలు ఉడక నివ్వాలి. చివర్లో తెల్ల మిరియాల పొడి చల్లి, తగినంత ఉప్పు వేసి, పైన క్రీం వేసి సర్వ్ చేయాలి.

నోట్‌: వెజిటబుల్‌ స్టాక్‌ కోసం... గాజర్‌, బీన్స్, గోబీ పువ్వు, ఉల్లిపాయలు, మిరియాలు లీక్‌, సెలరీ, కరివేపాకు అన్నీ వేసి ఒక గంటసేపు ఉడికించాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి