బెండకాయ పచ్చడి
కావలసిన పదార్థాలు :
బెండకాయలు... పావు కిలో
ఎండుమిరప కాయలు... పది
నిమ్మకాయంత... చింతపండు
పసుపు, ఇంగవ... చిటికెడు
పోపు దినుసులు... మూడు స్పూన్లు
తయారీ విధానం :
బెండకాయల్ని శుభ్రం చేసుకుని ఆరబెట్టి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వేడయిన బాణలిలో నూనెను పోసి వేడయ్యాక బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి. బాగా వేగాక ఆ బాణలిని స్టౌవ్‌మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనెను పోసి బాగా కాగాక అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించి తీసి కాసేపు ఆరబెట్టిన తరువాత రోట్లో వేసి దంచుకోవాలి. దీనికి చింతపండును కలిపి నూరి, ఆపై వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా కలిపి దంచాలి. తరువాత నూరిన పచ్చడిని తీసి పోపు పెట్టుకోవాలి. అంతే బెండకాయపచ్చడి రెడీ. ఈ పచ్చడి మూడు నాలుగు రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది.
|