వంకాయతో రసం
|
వంకాయలు... 100 గ్రాములు
మిరియాల పొడి... ఒక టీస్పూన్
జీలకర్ర పొడి... ఒక టీస్పూన్
ఎండు మిర్చి పొడి... రెండు టీ స్పూన్లు
టమోటా... ఒకటి
చింతపండు... రసానికి తగినంత
ఇంగువ పొడి... చిటికెడు
పసుపు పొడి... చిటికెడు
తయారీ విధానం :
లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించండి. వేయించిన తర్వాత అందులో మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చుకోండి. దానికి కాస్తంత చింతపండు రసాన్ని కలిపి, ఉప్పు కావలసినంత చేర్చుకోవాలి. చింతపండు రసం వద్దనుకునేవారు టమోటా రసాన్ని చేర్చుకోవచ్చు. కొత్తిమీర తరుగుల్ని చేర్చిన తరువాత చారును దించేయాలి. అంతే వంకాయ రసం రెడీ.
