Astrology Zodiac Aquarius Chr.htm

Notifications

కుంభం కుంభం
గుణగణాలు

సన్నగా పీలగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశులు వారితో అత్యంత స్నేహ పాత్రంగా మెలగుతారు. ఇతరులకు సాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు.మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశి వారు ఇతురులను అవహేళనచేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు.తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటి తనం శత్రువులను కూడా తెచ్చి పెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితోపాటు మొండి పట్టుదలకూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యలలో చిక్కుకుంటారు.

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దుమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. దూరపు బంధువుల శుభలేఖ అందుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవదీక్ష స్వీకరిస్తారు.

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమేదీపావళి పండుగ రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం వంటి అద్భుత యోగాలు ఏర్పడనున్నాయి. ఎంతో శుభ ఫలాలను అందించగల యోగాల వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం తదితర రాశుల జీవితంలో అదృష్టం, అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. దీపావళి పండుగలో ఏర్పడే గ్రహ యోగాల వల్ల ఈ ఏడాది వివిధ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం స్వాతి నక్షత్రంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా తులా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు అనే గ్రహాలు, సింహ రాశిలో గురువు, కేతువు, కుజుడు అనే గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. బుధుడు, శుక్రుడి స్థితి వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇలాంటి అద్భుత యోగాలు దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి.

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?దీపాల పండుగ అయిన దీపావళిని చాలా మంది కేవలం వేడుకకు సంబంధించిన రోజుగానే భావిస్తారు. కానీ దీపావళి పండుగ మన ఇంట్లోనూ, జీవితంలోనూ సంతోషాన్ని, మంగళాన్ని, సంపదను శాశ్వతంగా ఉండేలా చేసే అద్భుతమైన పర్వదినం. ఇది మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే రోజుగా భావిస్తారు. ఈ రోజున తెలియకుండా ఈ తప్పులను చేయకూడదు. దీపావళి పండుగ అనేది మన ఇంట్లోనూ, జీవితంలోనూ ఉన్న అజ్ఞానం, దుఃఖం అనే చీకటిని తొలగించి, మేలు, సంతోషం, అభివృద్ధి, సంపద వంటి వాటిని ప్రసాదించేందుకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శక్తివంతమైన రోజుగా దీపావళి రోజును భావిస్తారు. అందువల్ల ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలు మనకు ఎంతో గొప్ప ఫలితాలను, పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని నమ్మకం.