Astrology Zodiac Aquarius Luc.htm

Notifications

కుంభం కుంభం
ఆదాయం మరియు అదృష్ణం

కుంభరాశి చెందిన వారు వృత్తి వ్యాపారాలములందు విజయవంతులుగా ఉంటారు.వీరి జీవితగమనం కూడా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. గ్రహ స్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు వైద్యవృత్తిలోనూ రాణిస్తారు. మొత్తంమీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. సాంకేతికరంగంలో ప్రవేశించినా విజయం సాధిస్తారు.

నాగర్‌కర్నూల్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల విలువైన వరి ధాన్యం మాయం

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులువిజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఒక భక్తుడు గురువారం నాడు సుమారు రూ. 75 లక్షల విలువైన, 494 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. దుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగురాళ్లతో పొదిగిన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. సీనా నాయక్, దసరా ఉత్సవాల ప్రధాన అధికారి వి. త్రినాథ్ రావు కలిసి ఈ కానుకను స్వీకరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున, అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.