Astrology Zodiac Aries Hlt.htm

Notifications

మేషం మేషం
ఆరోగ్యం

మేషరాశికి చెందిన వారికి బాల్యంలోనే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారై ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు అప్పటి అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్త్మా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిన్నతనంలోనే బాధిస్తాయి. మామూలు జ్వర సమస్యలు మొదులుకుని కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు మెండు. కనుక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను ప్రదర్శించాల్సి ఉంటుంది.

నాగర్‌కర్నూల్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల విలువైన వరి ధాన్యం మాయం

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులువిజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఒక భక్తుడు గురువారం నాడు సుమారు రూ. 75 లక్షల విలువైన, 494 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. దుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగురాళ్లతో పొదిగిన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. సీనా నాయక్, దసరా ఉత్సవాల ప్రధాన అధికారి వి. త్రినాథ్ రావు కలిసి ఈ కానుకను స్వీకరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున, అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.