1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Apple Health benefits

యాపిల్‌లోని హెల్ద్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి

Apple Health benefits
ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిచ్చే రసాలూరే ఆపిల్ పండ్లలో త్వరగా జీర్ణమయ్యే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఫైటోకెమికల్స్‌ను రక్షించే రోగనిరోధక వ్యవస్థ మెండుగా ఉంటుంది. సిమ్లా, కాశ్మీర్ యాపిల్స్ తాజాగా ఉంటాయి. శీతాకాలంలో ఇవి బాగా పండుతాయి. ఈ పండ్లలోని యాంటిఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రంగు, రుచి, పోషక విలువల దృష్ట్యా చాలామంది యాపిల్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. 
 
దంతాలు, ఎముకల ఆరోగ్యానికి ఆపిల్ ఎంతో మేలు చేస్తుంది. ఆపిల్ అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది. క్యాన్సర్ రిస్క్‌ను చాలామటుకు తగ్గిస్తుంది. ఆపిల్‌లోని ఫైబర్ కొలెస్ట్రాల్ బరువును తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. గుండె సంబంధింత రోగాలను దూరం చేస్తుంది. లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆపిల్ పండ్లలో డయేరియాను నిరోధించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
ఆపిల్‌లోని న్యూట్రీషన్ విలువలు :  
ఆపిల్‌లో కొవ్వు ఉండదు. సోడియం, కొలెస్ట్రాల్ ఉండదు. 
విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్స్ (బరువును నియంత్రిస్తుంది)  
డైట్ ఫైబర్ -హృద్రోగ వ్యాధులను నయం చేస్తుంది. 
మినరల్స్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌ అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
About Writer
Selvi