1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Benefits of Brinjal

నీరసంగా ఉందా? అయితే వంకాయను తీసుకోండి!

Benefits of Brinjal
నీరసంగా ఉందా? అయితే ఆలోచించకండి.. వంకాయలను వంటల్లో చేర్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేద గుణాలెన్నో కలిగిన వంకాయను తీసుకోవడం ద్వారా ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. వంకాయ వరుగుల్ని.. నువ్వుల నూనెలో వేపి మిరియాలు, ఉప్పు చిలకరించి తీసుకుంటే అజీర్ణానికి చెక్ పెట్టవచ్చు. 
 
అయితే చర్మ సంబంధిత అలెర్జీలున్న వారు మాత్రం వంకాయలను తీసుకోవడం తగ్గించాలి. వంకాయల్లో విటమిన్ ఎ, సీ, బీ1, బీ2లున్నాయి.  వర్షాకాలంలో వంకాయల్ని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెద్ద వంకాయల కంటే పిందెలను అధికంగా వంటల్లో చేర్చుకుంటే మోకాలి నొప్పులకు చెక్ పెట్టవచ్చునని వారు చెబుతున్నారు. 
About Writer
Selvi