బెర్రీ పండ్లలో ఉండే మేలెంతో తెలుసుకోండి.
బెర్రీ పండ్లను కొద్దిగా తీసుకున్నా వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి మంచి శక్తి లభిస్తుంది. బ్లూబెర్రీని బ్రెయిన్ బెర్రీ అని యూత్ బెర్రీ అని కూడా అంటారు. గూస్ బెర్రీస్ పైన చిన్న చిన్న ముండ్లు ఉంటాయి. ఇవి ఆకుపచ్చగా చిన్నవిగా ఉంటాయి. ఇక స్ట్రాబెర్రీస్ కూడా ఎర్రగా ద్రాక్ష సైజులో ఉంటాయి. ఇక స్ట్రాబెర్రీస్ బొంగరం ఆకారంలో ఎర్రగా ఉంటాయి. వీటిలో విటమిన్ ''సి'' పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే గాక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఇక క్రాన్ బెర్రీ ఎరుపు రంగులో ఉన్న చిన్నపండు. చిన్న చిన్న పొదల్లో అల్లుకుని ఉండే చెట్లకు ఇవి పండుతాయి. వీటిని వంటల్లో కూడా ఉపయోగిస్తారు. గూస్ బెర్రీనిభ భారతదేశ ఆమ్ల అంటారు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అలాగే కరిగిపోయే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌పై పోరాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహవ్యాధిని తగ్గిస్తుంది. అన్ని రకాల బెర్రీ పండ్లలోనూ వాపులను తగ్గించే గుణం ఉంటుంది. క్యాలరీలు తక్కువ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.