గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (14:35 IST)

విడాకుల వ్యవహారంపై సుమ రాజీవ్ కనకాల ఏమన్నారు?

Jayamma- Suma
తన నుంచి విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలపై సుమ రాజీవ్ కనకాల స్పందించారు. ఈ విషయంపై ప్రముఖ హాస్య నటుడు అలీ అడిగిన ప్రశ్నకు సుమ సమాధానమిచ్చారు. భార్యాభర్తల వైవాహిక జీవితంలో చిన్నపాటి మనస్పర్థలు, గొడవలు సహజమేనని చెప్పారు. ఇక విడాకుల విషయానికి వస్తే విడాకులు తీసుకోవడం చాలా ఈజీ అని చెప్పారు. 
 
కానీ, ఒక తల్లిదండ్రులుగా ఇది చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు విడిపోదామని అనుకున్నారు. కానీ పిల్లల గురించి ఆలోచించి కలిసిపోయారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.