మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2022 (11:33 IST)

నజ్రియా ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, నేను ట్రై చేసా...: నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Nazria
వెరైటీ టైటిళ్లు, కథలతో ప్రేక్షకులు ముందుకు వచ్చే నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం 'అంటే సుందరానికి'. ఈ చిత్రం జూన్ 10న విడుదల కాబోతోంది. నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా జంటగా యువ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోంది. నిన్న ఉదయం టీజర్‌ విడుదల కార్యక్రమం ఏఎంబీ మాల్‌లో జరుగగా ఆ సందర్భంగా నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

 
తనతో నటించిన నజ్రియా గురించి చెపుతూ... ఆమెని తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని గతంలో ఎంతో మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. వాళ్లలో ఎవరు ఫోన్లు చేసినా నజ్రియా ఫోన్ లిఫ్ట్‌ చేయలేదట.

 
వేరేవాళ్లతో తమ సినిమాల్లో నటించాలని చెప్పినా ఒప్పుకోలేదు. నేను ట్రై చేసా, ఫోన్ కలిసింది. అంతే... మా సినిమాలో నటించడానికి మాత్రం ఒప్పుకుంది. కథ నచ్చి ఆమె సినిమా చేశారు. అందుకు ఆమెకు ధన్యవాదాలు చెపుతున్నా' అని నాని చెప్పాడు.