సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (14:27 IST)

వివేక్ ఆత్రేయ లాగా ఎవ్వ‌రూ సినిమా తీయ‌లేరు - నాని

Nani, Nazriya Fahad, Vivek Atreya, ravi
Nani, Nazriya Fahad, Vivek Atreya, ravi
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, న‌జ్రియా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి`. బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం టీజ‌ర్ విడుదలైంది. మాదాపూర్‌లోని ఎ.ఎం.బి.థియేట‌ర్‌లో చిత్ర యూనిట్‌, అభిమానుల స‌మ‌క్షంలో టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా వుండ‌డంతో చిత్రంపై అంచ‌నాలు మ‌రింత హైప్‌ను క్రియేట్ చేశాయి.
 
ఈ సంద‌ర్భంగా నేచురల్ స్టార్ నాని, పంపిణీరంగంలోనూ ఎగ్జిబిట‌ర్ రంగంలోనూ సినిమా స్థాయిని పెంచిన  నారాయ‌ణ‌దాస్ నారంగ్‌కు ముందుగా నివాళుల‌ర్పించారు. 
 
అనంత‌రం నాని మాట్లాడుతూ, శ్యామ్‌సింగ‌రాయ్ చిత్ర టీజ‌ర్‌కూడా ఇక్క‌డే విడుద‌ల‌యింది. అందుకే సెంటిమెంట్‌గా భావిస్తున్నా. స‌హ‌జంగా ద‌ర్శ‌కుల టీమ్ వెనుక‌వుండి ప‌నిచేస్తుంటారు. కానీ ఈ సినిమాకు మాత్రం మెయిన్ స్ట్రీమ్‌గా వుండి స‌హ‌క‌రించారు. శ్యామ్‌సింగ‌రాయ్‌కు క్రిస్మ‌స్ మ‌న‌దే అన్నా. ఇప్పుడు `అంటే సుందరానికి` మ‌ళ్ళీ క్రిస్‌మ‌స్ దాకా మ‌న‌దే అంటూ అభిమానులను ఉత్సాహ‌ప‌రిచారు. ఈ సినిమా నాకు చాలా ప్ర‌త్యేక‌మైంది. చాలా రోజుల త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో ప‌నిచేసిన అనుభూతి క‌ల్గింది. అదంతా సినిమాలో క‌నిపిస్తుంది. కొన్ని క‌థ‌లు బాగుంటాయి. కానీ మ‌రో ద‌ర్శ‌కుడు తీస్తే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న క‌లుగుతుంది. కానీ వివేక్ ఆత్రేయ సినిమాలు ఆయ‌న త‌ప్పిదే మరొక‌రు తీయ‌లేరు. నాలో ప్రేక్ష‌కుడు వివేక్ సినిమాను మొద‌టి షో నాడే చూస్తాడు. అలాగే మీరు చూస్తార‌ని ఆశిస్తున్నా. ఇక న‌జ్రియాను తెలుగులో న‌టించ‌డానికి చాలామంది ప్ర‌య‌త్నించారు. సాధ్య‌ప‌డ‌లేదు. కానీ మా రిక్వెస్ట్‌ను మ‌న్నించి న‌టించినందుకు ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తుకుంటున్నాను. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్‌కు రెండు రెట్లు ట్రైల‌ర్, దానికి ప‌ది రెట్లు సినిమా వుంటుంద‌ని అన్నారు.
 
నిర్మాత‌ల్లో ఒక‌రైన రవిశంకర్ వై. మాట్లాడుతూ, ఈ సినిమా మా బేన‌ర్‌కు ప్ర‌త్యేక‌మైంది. కొన్ని స్క్రిప్ట్ లెవ‌ల్లోనే హిట్ అని తెలిసిపోతుంది. అందులో భాగంగానే `అంటే.. సుంద‌రానికి` క‌థ విన‌గానే సూప‌ర్‌డూప‌ర్ హిట్ అనుకున్నాం. ఈ సినిమాకు ప‌నిచేసిన సంగీత‌ద‌ర్శ‌కుడు వివేక్‌సాగ‌ర్‌, చిత్ర టీమ్ అంతా ఒకే సింక్‌లో ప‌నిచేశారు. అప్పుడే సినిమాపై న‌మ్మ‌కం క‌లిగింది. మొత్తం ప్రొడ‌క్ట్ చూశాక మ‌రింత పెరిగింది. నాని, న‌జ్రియా ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. మా మైత్రీ మూవీస్ బేన‌ర్‌లో స‌క్సెస్‌ఫుల్ హీరోల ప్లేస్‌లో నానికి ప్లేస్ వుంది. నానికి ఈ సినిమా సింహ‌భాగం అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. మే 12న `స‌ర్కారివారి పాట‌`తో స‌క్సెస్ కొట్ట‌బోతున్నాం. నాని సినిమా కూడా అంత‌స్థాయిలో హిట్ కొడుతుంది అని తెలిపారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, అంద‌రికీ టీజ‌ర్ న‌చ్చింద‌ని భావిస్తున్నా. దీనికి మించి ట్రైల‌ర్ వుంటుంది. అంత‌కుమించి సినిమాల్లో చూడ‌బోతున్నారు. నాని, న‌జ్రియా డ్రీమ్ కాంబినేష‌న్ ఇది. నేను ఏదైనా స్క్రిప్ట్‌లో రాసింది వ‌స్తే బాగుంటుంద‌ని అనుకుంటా. దానిని నా టీమ్ పైస్థాయికి తీసుకెళ్ళేలా కృషి చేశార‌ని అన్నారు. 
 
హీరోయిన్ న‌జ్రియా మాట్లాడుతూ, తెలుగులో నాకిది మొద‌టి సినిమా. నామీద పూర్తి న‌మ్మ‌కంతో వున్న‌ ట‌మ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు..
 
ఎడిట‌ర్ ర‌వితేజ మాట్లాడుతూ, ఇప్పుడు విడుద‌లైన టీచ‌ర్ కంటేట్రైల‌ర్ చాలా ఫ‌న్‌గా వుంది. సినిమా మ‌రింత ఫ‌న్‌గా వుంటుంది. సూప‌ర్ ఫ‌న్ సినిమా చేశాం. జూన్ 10న చూసి ఆనందించండి అన్నారు. ఇదే అభిప్రాయాన్ని సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ల‌తా నాయుడు వ్య‌క్తం చేశారు.