నాని నటించిన అంటే సుందరానికి టీజర్ రాబోతుంది
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మొదటి పాట పంచెకట్టు సూపర్‌హిట్ కాగా, పోస్టర్లు, హోమం వీడియో స్పెషల్ బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఇప్పుడు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ డేట్‌ని ప్రకటించడంతో పాటు మరో రెండు బ్రాండ్ న్యూ పోస్టర్‌లను విడుదల చేశారు.
ఈ పోస్టర్స్ లో హీరో, హీరోయిన్ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా వుంది. ఇందులో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి నటిస్తుండగా, నజ్రియా, లీలా థామస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో క్లాస్ అండ్ స్టైలిష్‌గా, మరో పోస్టర్‌లో సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.