ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:12 IST)

అంటే.. సుందరానికి చిత్ర యూనిట్ పంచెకట్టు థీమ్ పార్టీ

Nani pancha kattu
Nani pancha kattu
నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే.. సుందరానికి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మాతలుగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్ర వినూత్న ప్రచారం సినీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తినిపెంచుతోంది.
 
వివేక్ సాగర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘పంచెకట్టు’ పాటని విడుదల చేయడంతో చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషనన్స్ ని ప్రారంభించారు. ఈ పంచెకట్టు పాట సంగీత ప్రియులని అలరిస్తోంది. ట్రెండీ ట్యూన్ తో సరికొత్తగా, సరదాగా సాగిపోయే సాహిత్యంతో స్వరపరిచిన ఈ పాట విన్న వెంటనే హుషారు తెప్పిస్తోంది.
 
పద్మశ్రీ అవార్డు గ్రహీత, లెజెండరీ క్లాసికల్ సింగర్ అరుణా సాయిరామ్ ఈ పాటను అద్భుతంగా పాడగా, హసిత్ గోలీ సాహిత్యం అందించారు.
 
Nani pancha kattu with team
Nani pancha kattu with team
ఇప్పుడు ‘పంచెకట్టు’పాట చార్ట్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటుంది చిత్ర యూనిట్. ఈ వేడుకని కూడా పంచెకట్టు థీమ్ లో డిజైన్ చేశారు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ అంతా పంచకట్టులో హాజరవుతారు. సినిమా కోసం టీమ్ చేస్తున్న వినూత్న ప్రచారం అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.
 
‘అంటే.. సుందరానికి’చిత్రంలో నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న‘అంటే సుందరానికి’చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమవుతోంది.