శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (17:54 IST)

యాడ్‌లోనే కిక్ వుంది - శ్రద్ధాదాస్

Shraddhadas
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రిటైలర్ఎ లక్ట్రానిక్స్ సంస్థ బజాజ్ ఎలక్ట్రానిక్స్ త‌మ వంద‌వ స్టోర్ ను బుధ‌వారంనాడు ప్రారంభించింది. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఇనార్బిట్ మాల్‌లో మైల్‌స్టోన్ 100 స్టోర్‌లను ప్రారంభించింది. దీనిని న‌టి శ్రద్ధాదాస్ ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఆమె పాల్గొన్న యాడ్‌ను (వాణిజ్య ప్ర‌క‌ట‌న‌) ప్ర‌ద‌ర్శించారు. దాన్ని త‌దేకంగా చూస్తున్న శ్ర‌ద్దా యాడ్ చేయ‌డంలో కిక్ వుంద‌ని తెలిపింది. సినిమాలు చేయ‌డం ఆడ‌క‌పోవ‌డం, ఆడ‌డం ఒక భాగ‌మైతే యాడ్ అనేది ప్ర‌తి ఒక్క‌రినీ చేరువ‌వుతుంది అని తెలియ‌జేసింది. 
 
ఈ సందర్భంగా Mr.కరణ్ బజాజ్ CEO బజాజ్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతూ,"మా మైలురాయి 100వ స్టోర్‌ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్ విస్తృత శ్రేణి వంటి, హోమ్ & వంటింటి ఉపకరణాలు,మొబైల్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు మొదలైనవన్నీ అందుబాటు ధ‌ర‌లోనే దొరుకుతాయిని తెలిపారు.