శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:36 IST)

మాదాపూర్ లో స్పా చాటున వ్య‌భిచార కేంద్రం!

హైద‌రాబాదులో వివిధ పాకెట్ల‌లో వ్య‌భిచార కేంద్రాలు గుట్టు చ‌ప్పుడు కాకుండా న‌డుస్తున్నాయి. లాక్ డౌన్ నేప‌థ్యంలో చాలా వర‌కు త‌గ్గిన వ్య‌భిచార ముఠాలు, ఇపుడు స‌డ‌లింపు రావడంతో మ‌ళ్ళీ త‌మ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేస్తున్నాయి. స్పాసెంటర్ లు, బ్యూటీ పార్ల‌ర్ల ముసుగులో వ్య‌భిచార కేంద్రాల‌ను నిర్వ‌హిస్తున్నారు.
 
స్పా సెంటర్‌, బ్యూటీ సెలూన్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను ఎస్‌వోటీ పోలీసులు  అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిర్వాహకుడితో పాటు ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులు, 10 మంది యువతులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.73 వేల నగదు, 28 మొబైల్‌ ఫోన్లు, ఓ కారు, రూ.4 లక్షలు బ్యాలెన్స్‌ ఉన్న బ్యాంకు అకౌంట్ ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.