మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (21:41 IST)

మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి

హైదరాబాద్ మాదాపూర్‌లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 
 
కారు నడిపిన వ్యక్తిని విద్యుత్‌ శాఖ డీఈ నరేందర్‌రెడ్డిగా గుర్తించారు. ఘటన అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.