గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (11:31 IST)

దివ్యాంగురాలితో అక్రమ సంబంధం... పెళ్లి మాటెత్తగానే గొంతు నులిమి చంపేశారు..

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఓ దారుణం జరిగింది. ఓ దివ్యాంగురాలు దారుణ హత్యకు గురైంది. ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి పెళ్లి మాటెత్తగానే గొంతునులిమి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శంషాబాద్ మండలం ఉట్​పల్లి ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన యాదమ్మ(35) అనే దివ్యాంగురాలు టైలరింగ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది. 
 
ఈమె గురువారం నిద్రపోయిన ఆమె శుక్రవారం ఉదయం పొద్దుపోయాక కూడా లేవలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు తీసి చూడగా మృతి చెంది ఉంది. వెంటనే  పోలీసులకు సమాచారం అందించి, అదే కాలనీకి చెందిన కృష్ణ యాదవ్‌ను అనుమానిస్తూ ఫిర్యాదు చేశారు. 
 
గత కొంతకాలంగా యాదమ్మకు, ఈయనకు అక్రమ సంబంధం కొనసాగిస్తూ తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కృష్ణయాదవ్ గురువారం అర్థరాత్రి యాదమ్మ ఇంటికి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది.
 
దీంతో అతడి​ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యాదమ్మ పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతోనే అడ్డు తొలగించుకోవాలని ఆమె ఇంటికెళ్లి గొంతు పిసికి హత్యచేసి ఆరు తులాల బంగారంతో పరారైనట్టు కృష్ణ యాదవ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు.