సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (14:12 IST)

మూసీ నదిలో తిరుగుతున్న మొసలి

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో మొసలి కలకలం సృష్టించింది. అత్తాపూర్‌ వద్ద మూసీ నదిలో మొసలి తిరుగుతుంది. హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది.

దీంతో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో అధికారులు జంట జలాశయాల గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు.
 
ఈ క్రమంలో మూసీ వరదలో మొసలి కొట్టుకొచ్చింది. అత్తాపూర్‌ వద్ద స్థానికులు దానిని గుర్తించి.. జూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.