1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. NTR Aravinda Sametha created sensation in USA

యు.ఎస్‌లో అర‌వింద స‌మేత సంచ‌ల‌నం..!

NTR
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అర‌వింద స‌మేత‌. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ద్వారా యు.ఎస్ బాక్సాఫిస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఉదయం 11 గంటల వరకు ఈ చిత్రం అక్కడ 161 లొకేషనల్లో $400k వసూళ్లను రాబట్టింది. 
ఎన్టీఆర్ కెరీర్లోనే హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ అభిన‌యం - త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు - హారిక హాసిని నిర్మాణం అన్నీ క‌లిసి ఈ సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానికి ఎత్తేసాయి. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ ద్వారా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఫ‌స్ట్ వీక్ ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
ఆలయాల్లో మహిళల అంగాంగ ప్రదర్శనలు.. చూసి ఆనందిస్తున్న పురుషులు..