మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (13:19 IST)

ప్రధాని నరేంద్ర "చాయ్ వాలా" ఐతే ఈ మోదీ పానీపూరీ వాలా?!

Narendra Modi
Narendra Modi
గుజరాత్‌లో అచ్చం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి చాట్ విక్రయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాన మంత్రి మోదీ గతంలో టీవాలా అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోదీ లాంటి రూపం కలిగివున్న వ్యక్తి.. చాట్ అమ్ముతున్నాడు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. 
 
ప్రస్తుతం గుజరాత్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధాని మోదీ రూపాన్ని పోలి ఉంటుంది. ఈ వీడియోపై జనాలు కూడా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి చాట్ అమ్ముతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వీడియోను బ్లాగర్ కరణ్ ఠక్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
 
వీడియోలో ప్రత్యేకత ఏమిటి?
ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అనిల్ భాయ్ ఖట్టర్. ప్రధాని మోదీ "చాయ్ వాలా" అయినట్లే ఆయన "పానీపూరీ" వాలా అని అనిల్ భాయ్ ఖట్టర్ అన్నారు. అనిల్ భాయ్ ఖట్టర్ ప్రధాని మోదీని తలపిస్తున్నారు. 
 
అదే సమయంలో ప్రధాని మోదీ తరహాలో కుర్తా, జాకెట్‌తో పాటు ప్రధాని తరహాలో గడ్డం, గాజులు కూడా ధరించారు. ఈ లుక్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారని, విపరీతంగా ఈ వీడియో షేర్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Thakkar