గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (13:12 IST)

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే తరహాలో ఆవు హగ్ డేగా జరుపుకోండి..

cow2
"సానుకూల శక్తిని" వ్యాప్తి చేయడానికి "సామూహిక ఆనందాన్ని" ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 14న "కౌ హగ్ డే"ని జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా బుధవారం నోటీసు జారీ చేయడంతో ట్విట్టర్‌లో వెంటనే ఫన్నీ మీమ్స్ పుట్టుకొచ్చాయి.  
 
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. "ఆవు ప్రేమికులందరూ ఫిబ్రవరి 14వ తేదీని ఆవు హగ్ డేగా జరుపుకోవచ్చునని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇది ఆవుల ప్రాముఖ్యతను దృష్టిలో వుంచుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. 
 
ఈ మేరకు పశుసంవర్ధక -పాడిపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బోర్డు జారీ చేసిన నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మీమ్స్, సెటైరికల్ ట్వీట్లు పేలుతున్నాయి.