శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (11:11 IST)

యూకే ప్రధాని కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు.. అరటిఆకులో భోజనం..

rishi sunak
యూకేలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారతదేశంలో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ పండుగను జరుపుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వివిధ దేశాల్లో దక్షిణ భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో యూరప్‌లో కూడా ఈ పండుగ ప్రజాదరణ పొందింది.
 
తాజాగా యూకేలోని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది సంక్రాంతి విందుతో జరుపుకుంటున్నట్లు చూపించే వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. వైరల్‌గా మారిన వీడియోలో స్త్రీపురుషుల వస్త్రధారణ ఆకట్టుకుంది. ప్రధాని కార్యాలయ సిబ్బంది.. అధికారిక దుస్తులు, యూనిఫాం ధరించి, అరటి ఆకులపై వడ్డించే సాంప్రదాయ భోజనాన్ని తీసుకున్నారు. ఇంకా చేతితో ఆహారాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.