బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (11:57 IST)

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన నిర్మాత సురేష్ బాబు (video)

Suresh Babu
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది. ఫిల్మ్ నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి సమస్య సృష్టించినట్లు సమాచారం. 
 
సంఘటనా స్థలంలో ఉన్న నిర్మాత సురేష్ బాబు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ను నియంత్రించి ఎట్టకేలకు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 
 
వైరల్‌గా మారిన వీడియోలో సురేష్‌బాబు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వాహనాలను కంట్రోల్ చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఈయన వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా అనుమతించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.