1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (15:28 IST)

హైదరాబాదులో కొత్త సంవత్సర వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

traffic signal
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాదులో ఆంక్షలు విధించింది ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీసు విభాగం విధించింది. ట్రాఫిక్ ఉల్లంఘలనపై డిసెంబరు 31న నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
 
లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి దారి మళ్లించనున్నారు. ఆంక్షల సమయంలో మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేస్తారు. ఖైరతాబాద్ మీదుగా నెక్లెర్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ దిశగా వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. అప్పర్ ట్యాంక్, లిబర్జీ జంక్షన్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి దారి మళ్లిస్తారు. 
 
అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అవుటర్ రింగ్ రోడ్డుపై, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పైనా వాహనాలు అనుమతించరు. అయితే, ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుందని నగర పోలీస్ విభాగం స్పష్టం చేసింది.
 
క్యాబ్లు/ టాక్సీ/ ఆటో రిక్షా ఆపరేటర్లు (కాంట్రాక్ట్ క్యారేజీలు) డ్రైవర్లు / ఆపరేటర్లు సరైన యూనిఫాంలో ఉండాలని, సరైన పత్రాలను తీసుకెళ్లాలని సైబరాబాద్ పోలీసులు జారీ చేశారు. ఏ ఒక్కరినీ అద్దెకు తీసుకోవడానికి నిరాకరించవద్దని, అలా నడపడానికి నిరాకరిస్తే ఇ-చలాన్ రూపంలో రూ .500 జరిమానా విధించాలని ఆదేశించారు. వాహనం, సమయం, స్థలం మొదలైన వివరాలతో పౌరులు 9490617346 వాట్సప్ లో ఫిర్యాదులను పంపవచ్చు.