సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (11:00 IST)

రవితేజ ఓ అరాచకం : బండ్ల గణేష్

Bandla Ganesh
Bandla Ganesh
బండ్ల గణేష్ ఎవరి గురుంచి అయినా గొప్పగా చెపుతాడు. ఒక వైపు సెటైర్ వేస్తూ మరోవైపు చురకలు వేస్తుంటాడు. ఎక్కువగా ఇంద్రుడు, చంద్రుడు  అంటూ తెలుగు కొత్త పదాలు చేరుస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి నేను అభిమాని కంటే అభిమానిని అంటూ ఏవో ఏవో  చెపుతాడు. తాజాగా రవితేజ  గురించి  ధమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో  ఆయన మాట్లాడారు. 
 
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఎవరీ సపోర్ట్ లేకుండా అనుకున్నది సాధించింది కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తున్నారు.   రవితేజ ఒక ఇన్స్పిరేషన్ ..  రవితేజ ఇంటీగ్రీటీ..  రవితేజ రాయాల్టీ,.. రవితేజ.. రియాల్టీ రవితేజ ..రాజసం రవితేజ అరాచకం. రవితేజ ఎవర్ గ్రీన్. ధమాకా సినిమా చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఏ ఫ్రేమ్ లో చూసిన అద్భుతంగా ఉన్నాడు.  వయస్సు తెలియలేదు. చాలా చురుగ్గా ఉన్నాడని తెలిపారు.