సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (16:13 IST)

రేపు వాల్తేరు వీరయ్య నుంచి "పూనకాలు లోడింగ్'...

poonakalu song loading
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో ఈ చిత్రంలోని ఒక్కో పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే టైటిల్ సాంగ్‌తో పాటు నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవితో పాటు మరో పాటను రిలీజ్ చేశారు. శుక్రవారం పూనకాల లోడింగ్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. మెగాస్టార్, మాస్ మహారాజాలు నటించిన పునకాలు లోడింగ్ అంటూ పాటపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. 
 
ఈ చిత్రం జనవరి 13వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించారు. రవితేజ ఓ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. కేథరిన్ టెస్రా కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చారు.