ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (17:39 IST)

రూ.100 కోట్ల క్లబ్‌ను టచ్ చేయనున్న 'ధమాకా'

dhamaka
మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "ధమాకా". శ్రీలీల హీరోయిన్. తాజాగా విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా జోరును కొనసాగిస్తుంది. వీకెండ్ తర్వాత కూడా నిలబడిన ఈ చిత్రం గత ఆరు రోజుల్లో ఏకంగా రూ.56 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అయితే, ఈ యేడాది ఆఖరు శుక్రవారమైన డిసెంబరు 30వ తేదీన అరడజనుకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ధమాకాకు గట్టి పోటీ ఇచ్చే చిత్రాలు ఏవీ లేవు. 
 
దీంతో ఈ వారాంతంలో కూడా ధమాకా జోరు కొనసాగనుంది. వచ్చే వారాంతంతో కలుపుకుని "ధమాకా" చిత్రం ఏకంగా రూ.100 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్ట వచ్చని ట్రేడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ మార్క్ కథ, త్రినాథ రావు మసాలా, శ్రీలీల గ్లామర్, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు ఇలా అన్ని అంశాలు కుదురుకోవడంతో ఈ సినిమా తొలి రోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.