ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:48 IST)

పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది : రవితేజ

Raviteja
Raviteja
అందరూ పండగలు చేసుకుంటారు. సినిమా హీరోస్ కూడా చేసుకుంటారు. కానీ వారి సినిమా హిట్ అయితే పెద్ద పండగే..రవితేజ అలాంటి పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. ధమాకా రూపంలో అది ఆయనకు దక్కింది. మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ''ధమాకా'. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధమాకా' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ధమాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మాస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
 
రవితేజ మాట్లాడుతూ.. ధమాకాలో పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ  కంగ్రాట్స్. సినిమాలో అందరం అందంగా వున్నామంటే దానికి ప్రధాన కారణం కార్తిక్ కెమరా పనితనం. ఈ సినిమా విజయానికి మొట్టమొదటి కారణం.. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. ఈ సినిమా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. ధమాకా సక్సెస్ కి రెండో కారణం. పీపుల్స్ మీడియా మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వారి పాజిటివిటీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అద్భుతమైన వ్యక్తులు. చాలా పాజిటివ్ గా వుంటారు. ఈ బ్యానర్ లో చాలా సినిమాలు రావాలి సూపర్ హిట్లు కావాలి. నేను కూడా ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తాను. బ్యానర్ అంత నచ్చింది. విశ్వప్రసాద్ , వివేక్ గారికి కంగ్రాట్స్. భరణి గారు, తులసీ గారు చమ్మక్ చంద్ర, జయరాం గారు, చిరాగ్ అందరూ అద్భుతంగా చేశారు. రావు రమేష్, ఆది ధమాకాలో మరో హైలెట్. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, రామలింగయ్య గారిలా అద్భుతంగా వినోదం పంచారు.  
 
ఈ సినిమాకి మరో ఆకర్షణ మా అందమైన హీరోయిన్ శ్రీలీల. అందం, ప్రతిభ,అభినయం అన్నీ వున్నాయి. ఇక డ్యాన్స్ ఐతే సూపర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తను పెద్ద స్టార్ కాబోతుంది. ఈ విజయానికి మరో కారణం డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్. డైలాగులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇంద్ర సినిమా స్పూఫ్ , పల్సర్ బైక్ పాట ఐడియా కూడా ప్రసన్నదే. రామజోగయ్య శాస్త్రి గారు, కాసర్ల శ్యామ్ చాల మంచి సాహిత్యాన్ని అందించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధమాకా సినిమాకి డ్రైవర్ దర్శకుడు త్రినాథరావు, నేను కండక్టర్ ని(నవ్వుతూ).  త్రినాథరావు, ప్రసన్న కాంబో ఎప్పుడూ హిట్టే. సెకెండ్ హ్యాట్రిక్ లోకి ఎంటర్ అయ్యారు. అదీ కొట్టేయాలి. అందరినీ ఇలానే  ఎంటర్  టైన్ చేయాలి. ధమాకాకి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పండగ. ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగమీద పండగ చేసుకోవాలి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలి. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.