గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (23:20 IST)

టాలీవుడ్ విలన్‌తో మిల్కీ బ్యూటీ డేటింగ్? (video)

tamannah - vijay varma
టాలీవుడ్ విలన్‌తో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ విలన్ ఎవరో కాదు. నేచురల్ స్టార్ నాని నటించిన "ఎంసీఏ" చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ వర్మ. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. వీరిద్దరూ ఇపుడు డేటింగ్‌లో ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి ఓ బలమైన కారణం లేకపోలేదు. 
 
కొత్త సంవత్సర వేడుకలను విజయ్ వర్మతో కలిసి తమన్నా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విజయ్ వర్మతో కలిసి పార్టీ మూడ్‌లో చాలా సన్నిహితంగా ఉన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విజువల్స్ చూస్తుంటే ఖచ్చితంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలను కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది. 
 
కాగా, గతంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను తమన్నా కొట్టిపారేశారు. ఇపుడు కూడా విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై మిల్కీ బ్యూటీ స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. కాగా, భోళా శంకర్ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయంతెల్సిందే.